telugu navyamedia
సినిమా వార్తలు

వెంకీమామ : మామాఅల్లుళ్ళ లుక్ అదుర్స్…!

Venki mama

విక్ట‌రీ వెంక‌టేష్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో “వెంకీ మామ” అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కి చేరుకుంది. అతి త్వ‌ర‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అయితే ఇటీవ‌ల భారీ యాక్ష‌న్ సీన్‌ని తెర‌కెక్కించారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో రూపొందిన‌ ఈ ఫైట్ సీక్వెన్స్‌ తెరకెక్కింది. చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. రియ‌ల్ లైఫ్‌లో మామ అల్లుళ్ళుగా ఉన్న చైతూ, వెంకీలు రీల్ లైఫ్‌లోను మామ అల్లుళ్ళుగా ఈ చిత్రంలో క‌నిపించ‌డం విశేషం. అయితే మామ‌ రైస్‌మిల్‌ యజమాని పాత్రలో సంద‌డి చేస్తే, అల్లుడు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మామా అల్లుళ్లుగా కలర్‌ఫుల్‌గా మెరిసిపోతున్నారు వెంకీ, చైతూ. పంచెలు కట్టుకుని ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుుకని నడుచుకుంటూ వస్తున్న ఈ పోస్టర్ అభిమానులను అలరిస్తుంది. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది.

Venki-Mama

Related posts