telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వెంకీ మామ” పైరసీ… పట్టేసిన అభిమానులు

Venky-mama

హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన‌ ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు యాజ‌మాన్యం నాలుగు రోజుల క్రితం విడుద‌లైన వెంకీ మామ చిత్రాన్ని బస్సులో ప్ర‌ద‌ర్శించారు. దీంతో ఆగ్ర‌హానికి గురైన వెంక‌టేష్ అభిమానులు బ‌స్సు డ్రైవ‌ర్‌ని ప‌ట్టుకొని పోలీసుల‌కి అప్ప‌గించారు. ఈ బ‌స్సు జ‌బ్బ‌ర్ ట్రావెల్స్‌కి సంబంధించిన‌ది అని తెలుస్తుండ‌గా, హైద‌రాబాద్ నుండి మైసూర్ వెళ్ళే స‌మ‌యంలో ఈ సినిమాని ప్ర‌ద‌ర్శించారు. ట్రావెల్స్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం అర్జున్ సుర‌వ‌రం సీడీలని ప‌బ్లిక్‌గా అమ్ముతుండగా, వాటిని నిఖిల్ స్వ‌యంగా ప‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. పైర‌సీని ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌ని హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎంత వేడుకున్న‌ప్ప‌టికి కొంద‌రు య‌ధేచ్చ‌గా పైర‌సీలు చేస్తూ విచ్చ‌ల విడిగా మార్కెట్లో విక్రయిస్తున్నారు.

Related posts