telugu navyamedia
news telugu cinema news trending

కొత్తగా.. వెంకీ .. ఫస్ట్‌లుక్ …

venkatesh new movie shoot from today

విక్టరీ వెంకటేష్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ చేసుకొని ఫస్ట్‌లుక్ పోస్టర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. నిజానికి వెంకీ కొత్త సినిమా గురించి చాలా రోజులుగా ఎన్నో వారతలు వస్తున్నా.. ఫస్ట్‌లుక్స్ రిలీజ్ అవుతాయని ఎవ్వరూ ఊహించలేదు. పైగా ఈ లుక్స్‌లో వెంకీ అవతారం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమను ఏలుతూ వస్తున్న వెంకటేష్.. ఎన్నో వైవిధ్యభరిత పాత్రలను పోషించారు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా అందరినీ అభిమానులుగా మార్చుకున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో అలరించే ఆయన ఇప్పుడు మరో డిఫెరెంట్ రోల్ పోషిస్తున్నారు. ఈ మేరకు వెంకటేష్ కొత్త సినిమా పేరు ‘నారప్ప’ అని కన్ఫర్మ్ చేస్తూ ఏకంగా నాలుగు ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్స్‌లో వెంకటేష్ గెటప్ గతంలో ఎన్నడూ చూడని విధంగా మరింత డిఫెరెంట్‌గా ఉంది. ఈ మూవీ వెంకటేష్ కెరీర్‌లో 74వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో హిట్టయిన ‘అసురన్’ సినిమాకు తెలుగు రీమేక్ ‘నారప్ప’. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన అసురన్ మూవీ 2019 సంవత్సరంలో విడుదలై సంచలన విజయం సాధించింది. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ఇదే సినిమాను వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

బుధవారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండటంతో టైటిల్‌ని రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘నారప్ప’ టైటిల్ సహా వెంకీ ఊరమాస్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉగ్రరూపం దాల్చుతున్న వెంకటేష్ పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించనున్నారు. చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియ‌మ‌ణి నటించనుందని టాక్. 22 నుంచి 3వారాల పాటు ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ అనంతపురంలో పరిసర ప్రాంతాల్లో జరగనుంది.

Related posts

ఆసక్తికరంగా “ప్రస్థానం” హిందీ టీజర్

vimala p

మున్సిపల్‌ స్టేడియంలో జగన్‌ ప్రమాణ స్వీకారం

vimala p

ఏకంగా 6 కోట్లు ఎగనామం పెట్టాడు… ఏం చేశాడంటే ?

vimala p