telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వచ్చే ఏడాది “నారప్ప” షూటింగ్

narappa

వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి రీమేక్‌ గా రూపొందుతున్న నారప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేస‌విలో విడుద‌ల చేయాల‌నుకుంటే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా షూటింగ్ ఆగింది. వెంకటేష్ అభిమానులు ‘నారప్ప’ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రం షూటింగ్ ను జ‌న‌వ‌రిలో స్టార్ట్ చేస్తార‌ట‌. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లోనే సినిమాను విడుదల చేసేలా స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ట‌. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగే భూవివాదాలు, కుల‌వివ‌క్ష నేప‌థ్యాల‌లో సినిమా ఉంటుంది.

Related posts