telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశ చరిత్రకు సమగ్రత చేకూరాలి: వెంకయ్య

Venkaiah-Naidu

దేశ చరిత్రకు సమగ్రత చేకూరాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలోని రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. చరిత్ర పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సరైన ప్రాధాన్యం లభించలేదని అభిప్రాయపడ్డారు.

చరిత్రకు సమగ్రత చేకూరాలంటే, స్వాతంత్ర్యం పట్ల వారికి ఉన్న భక్తి, తపనలను భావి తరాలు తెలుసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. చరిత్రలో స్వాతంత్ర్య సమర యోధులకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఇవ్వకపోవడం దురదృష్టకరం. చరిత్రను పరిశీలించి, వారి త్యాగాలను, ఘనతలను చాటిచెప్పాలన్నారు.

మన దేశ సంప్రదాయాలను కలుషితం చేయడమే కాకుండా, భారతీయులను హింసించి, మన శ్రమను దోపిడీ చేసి, ఇక్కడి సంపదను దోచుకుని వెళ్లిన రాబర్ట్ క్లైవ్ ను గొప్పవాడని చదువుతున్నామని అన్నారు.జీవితంలో ఒక్కసారైనా, విద్యార్థులు, రాజకీయ నాయకులు అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలును సందర్శించాలి. అప్పుడే దేశంకోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశం పట్ల వారి భక్తి, తపన అర్థమవుతాయన్నారు.

Related posts