రాజకీయ వార్తలు వార్తలు విద్య వార్తలు

8న వరంగల్‌కు ఉపరాష్ట్రపతి..‘నిట్‌’ వజ్రోత్సవాలకు హాజరు!

Murthy Run Higher values Education, Venkaiah

ఈ నెల 8న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరంగల్‌కు రానున్నారు. ప్రతిష్ఠాత్మకమైన నిట్‌లో ఈ నెల 8నుంచి నిర్వహించనున్న జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరుకానున్నారు. ఈ ఏడాదంతా వజ్రోత్సవాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి నిట్ అడ్మినిస్ట్రేషన్‌ అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య హాజరై వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, నిట్‌కు సంబంధించి సావనీర్‌ను ఆవిష్కరించనున్నారు.ఇందుకోసం నిట్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన కోర్సులు ప్రారంభంతో పాటు క్యాంపస్ అభివృద్ధిపై నిట్‌డైరెక్టర్‌ రమణారావు ఒక నివేదికను వెంకయ్యకు అందించనున్నట్లు సమాచారం. ఏడాదంతా జరిగే ఈ వజ్రోత్సవాలకు రాష్ట్ర గవర్నర్‌ నర్సింహాన్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం హాజరుకానున్నట్లు సమాచారం.

Related posts

తెలంగాణ లా సెట్, పీజీ సెట్.. వెబ్ ఆప్షన్స్…తేదీలు ఖరారు…

chandra sekkhar

పన్నీరు, పళనిస్వామి దోస్తానా !

admin

మీట్ అండ్ గ్రీట్ ‘చంద్రబాబు’ అంటున్న … నాట్స్

chandra sekkhar

Leave a Comment