• Home
  • Trending Today
  • మా పాట నీకు అంకితం అంటున్న స్టార్ హీరోలు.. ప్రణయ్ ఇదే మా నివాళులు
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు సినిమా వార్తలు

మా పాట నీకు అంకితం అంటున్న స్టార్ హీరోలు.. ప్రణయ్ ఇదే మా నివాళులు

Veeraboga Vasantha Rayalu 1st Song Dedicating to Pranay

రాష్ట్రంలో సంచలనంగా మారిన మిర్యాలగూడ పరువు హత్య(ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలో ప్రణయ్)ని హత్యచేయడంతో ఈ పరువు హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు… గత నాలుగు రోజులనుంచి ఎక్కడ చూసినా ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది.. రోజుకొక మలుపుతో ఈ కేసు మలుపులు తిరుగుతుంది.. ప్రణయ్, అమృతవర్షిణి లు 9వ తరగతి నుంచి ప్రేమించుకోవడం ఆ ప్రేమను కాపాడుకోవడానికి అమృత తన తల్లిదండ్రులను వదిలేసి ప్రణయ్ ని పెళ్లిచేసుకోవడం..

Veeraboga Vasantha Rayalu 1st Song Dedicating to Pranay

ఆ జంట ప్రేమ వ్యవహారం అమృత వర్షిణి తండ్రి వ్యాపారి మారుతీరావుకు తెలియడం వారిపై పలుమార్లు దాడి చేయడానికి ప్రయత్నించడం చివరకు ప్రణయ్ ని హత్య చేయించడం ఆ హత్య చేసిన సమయంలో సీసీటీవీ ఫోటేజ్ లో స్పష్టంగా కనపడటం…దీనికి తోడు పరువు హత్యను కుల హత్యగా మార్చి రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది.. ఈ పరువు హత్యకు సెలెబ్రెటీలు సైతం స్పందించడం విశేషం… కాగా ఇంద్రసేనా దర్శకత్వంలో నారా రోహిత్, శ్రియ జంటగా నటించిన ‘వీర భోగ వసంతరాయలు’ సినిమాలోనుంచి మొదటి పాటను ప్రేమకోసం బలైన వారికీ అంకితమిస్తున్నామని… తాజాగా ఇలా చనిపోయిన ప్రణయ్ కి ఈ పాట అంకితమని ఆ సినిమా మేకర్స్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు…

Veeraboga Vasantha Rayalu 1st Song Dedicating to Pranay

ఇదంతా పబ్లిసిటీ (ప్రమోషన్స్) కోసం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు.. కానీ ప్రేమికులందరికోసం ఈ పాటను అంకితం ఇయ్యడం మంచి ఆలోచన అంటూ ప్రశంసల వర్షం కురుస్తుంది..ఈ సినిమాలో శ్రీ విష్ణు, సుధీర్ బాబులు కూడా హీరోలుగా నటిస్తున్నారు.. ఈ చిత్రం సెప్టెంబర్ 21న విడుదల కానుంది..

 

“అరవింద సమేత” రిజల్ట్ పైనే ఆ బ్యానర్ భవిష్యత్… రెండవ పాట విడుదలకు ముహూర్తం ఖరారు

 

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, సునీల్‌, రావూ రమేష్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. “అరవింద సమేత” సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆడియో విడుదల వేడుక ఎప్పుడు జరుగుతుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20వ తేదీన భారీ ఎత్తున ఆడియో విడుదల చేయాలనీ దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు చిత్రయూనిట్‌.

తాజాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ గురించి ఫిలింనగర్ లో కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ బ్యానర్ పై ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అ ఆ’, ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాలను ఇదే బ్యానర్ పై నిర్మించారు నిర్మాత రాధాకృష్ణ(చినబాబు). ప్రస్తుతం త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ సినిమా రిజల్ట్ పైనే హారికా హాసిని క్రియేషన్స్ భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా దారుణంగా పరాజయం పాలవ్వడంతో ఆ ఎఫెక్ట్ నిర్మాతలపై బాగా పడిందట. ఆ నష్టాలను కవర్ చేయడానికే ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఈ బ్యానర్ పై మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోతే తాత్కాలికంగా ఈ బ్యానర్ ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడట నిర్మాత చినబాబు. కొంతకాలం పాటు సినిమాల నుండి బ్రేక్ తీసుకొని కోలుకున్న తరువాత సినిమాలు చేద్దామని అనుకుంటున్నాడట.

ఇదిలా ఉండగా రేపు సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు ఈ చిత్రంలోని రెండవ పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు చిత్రబృందం. ఇంతకుముందు ఈ చిత్రంలోని “అనగనగా…” అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. రేపు విడుదల కాబోయే రెండవ పాట గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు తారక్ అభిమానులు.

 

సెప్టెంబ‌ర్ 20న దేవ‌దాస్ ఆడియో పార్టీ..

 

దేవ‌దాస్ సినిమా ఆడియా పార్టీ (లాంఛ్) సెప్టెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ లో ఈ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న అందుకుంటున్నాయి. ప్ర‌త్యేకంగా వినాయ‌క‌చ‌వితి నాడు విడుద‌లైన ల‌క ల‌క లంకుమిక‌రా పాట‌కు రెస్పాన్స్ అద్భుతంగా వ‌స్తుంది.

Devdas audio party

ఇక సెప్టెంబ‌ర్ 17న నాగార్జున‌, నాని సినిమాలో త‌మ‌కు జోడీగా న‌టించిన హీరోయిన్లు ఆకాంక్ష సింగ్, ర‌ష్మిక మంద‌న్న‌ల పాత్ర‌లు.. వాళ్ల పేర్ల‌ను వాళ్ల వాళ్ల ట్విట్ట‌ర్ లో విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసారు. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌రేష్ వికే, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా గ్రూప్ వ‌యాక‌మ్ 18 వ‌చ్చి దేవ‌దాస్ కోసం వై జ‌యంతి బ్యాన‌ర్ తో టై అప్ కావ‌డంతో అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా దేవ‌దాస్ విడుద‌ల కానుంది.

 

న‌టీన‌టులు:
నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌..

సాంకేతిక విభాగం:
ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌
నిర్మాత‌: అశ్వినీద‌త్
సంస్థ‌లు: వైజయంతి మూవీస్ మ‌రియు వ‌యాక‌మ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్ర‌ఫ‌ర్: శ్యామ్ ద‌త్ సైనూద్దీన్
సంగీతం: మ‌ణిశ‌ర్మ
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహీ సురేష్

Related posts

జార్ఖండ్ లో దారుణం… స్నేహితులైన ఒంటరిగా దొరికితే… అఘాయిత్యానికే పాల్పడుతారు

jithu j

బిగ్ బాస్ విజేత కౌశల్ గురించి కొన్ని నిజాలు తెలిస్తే షాకే..

jithu j

టీవీ నందులకు మోక్షం

admin

Leave a Comment