telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

14 ఏళ్ళ వయసులోనే తొలిముద్దు… మెగా ప్రిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Varun-Tej

ఈ ఏడాది మొదట్లో సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి చేసిన “ఎఫ్2″తో మంచి విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన “గద్దలకొండ గణేష్”సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. కెరీర్ మొదటి నుంచీ డిఫరెంట్ పాత్రలు చేసుకుంటూ వెళుతున్న వరుణ్ తేజ్.. “గద్దలకొండ గణేష్” సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అయితే లక్ష్మి మంచు వ్యాఖ్యాతగా ‘వూట్’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన ‘ఫీటప్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు వరుణ్ తేజ్. ఇందులో లక్ష్మి మంచుతో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి పలు విషయాలను పంచుకున్నాడు. 14 వయసులోనే టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నట్లు, అదొక బ్యాడ్ మెమరీ అని చెప్పాడు వరుణ్. మెగా ప్రిన్స్. అమ్మాయిల నుంచి తనకు ఎన్నోసార్లు ప్రపోజల్స్ వచ్చాయని వరుణ్ చెప్పాడు. హైదరాబాద్‌లో ఓ క్లబ్ ఈవెంట్‌లో ఉండగా ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్నానని గుర్తచేసుకున్నాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి డాన్స్ చేస్తుండగా.. వెనకాల నుంచి ఓ అమ్మాయి గట్టిగా పట్టుకుందని చెప్పాడు. నా స్నేహితులని మొదట అనుకున్నానని, కానీ వారంతా తన ముందే ఉండడంతో వెనక్కి తిరిగి చూస్తే ఓ అమ్మాయి కనిపించందని, తేరుకునే లోపే ఆ అమ్మాయి తన బుగ్గుపై ముద్దుపెట్టి పారిపోయిందని, ఆ సమయంలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. తన లైఫ్‌లో మోస్త్ కలర్‌ఫుల్ పర్సన్.. తన చెల్లి నిహారికేనని, తాను సైలెంట్..కానీ తన చెల్లి మాత్రం వైలైంట్, నిహారిక ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉంటుందన్న వరుణ్.. ఏదైనా బాధ కలిగితే నిహారికతోనే పంచుకుంటానని చెప్పాడు.

Related posts