telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

చిరు బయోపిక్ లో .. నేను చేస్తా .. : వరుణ్

varun tej on chiranjeevi biopic

చిరంజీవి గారిని సైరా సినిమాలో హిస్టారికల్‌ రోల్‌లో చూస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంది. ఆయన ఏం చేసినా నేను చూస్తాను. నా సినిమాల కన్న కూడా ఆయన సినిమాలే ఎక్కువ చూస్తాను. దర్శకుడు హరీష్ శంకర్ ఈ మధ్య మాటల్లో చిరంజీవి బయోపిక్ చేస్తాను అని అన్నాడు. అందుకు రాంచరణ్ అయితే బాగుంటుంది అని చెప్పాను. ఒకవేళ రాంచరణ్ చేయకపోతే నేను మాత్రం చేస్తానని చెప్పాను అని వరుణ్ తేజ్ చెప్పారు. జిగర్తాండ ఒక వండర్ఫుల్‌ స్క్రిప్ట్‌. ఆ ఫీల్‌ పోకుండా మన నేటివిటీకి తగ్గట్లు ఫిఫ్టీ పర్సెంట్‌ చేంజెస్‌ చేశాం. గద్దల కొండ గణేష్‌ క్యారెక్టర్‌ ఎందుకంత భయంకరంగా ఉంటుందో అన్నదానికి ఫ్లాష్‌ బ్యాక్‌ యాడ్‌ చేసి నిడివి కొంచెం ఎక్కువ చేశాం. మిగతా క్యారెక్టర్స్‌ అలానే కొన్ని సీన్లు అలాగే తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మా ఫ్యామిలిలో చాలా మంది జిగర్తాండ సినిమా చూడలేదు. నా స్నేహితులు చాలా మంది కరెక్ట్‌ కాదేమో ఆలోచించుకో అన్నారు.. నేను చిరంజీవి గారికి ఫోన్‌ చేసి డాడీ కథ ఇలా అనుకుంటున్నాను అన్నాను. తరువాత హరీష్‌ నేను వెళ్లి కలిసాం. కథ చాలా బాగుంది నువ్వు తప్పకుండా చేయాలి అని చిన్న చిన్న సజెషన్స్‌ ఇచ్చారు. హరీష్‌ గారు కూడా వాటిని అప్లై చేశారు. పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘వాల్మీకి’. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది.

Related posts