telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వ‌రుణ్‌తేజ్ కొత్త సినిమా… వైజాగ్‌లో షూటింగ్

varuntej-boxer

వ‌రుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుండి వైజాగ్‌లో ప్రారంభమైంది. శ్రీను వైట్ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ నటిస్తున్న 10వ సినిమా ఇది. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ థమ‌న్ ఈ చిత్రానికి సంగీతం, జార్జ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.కెప్టెన్ అమెరికా.. మూవీకి పనిచేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లార్నెల్ స్టోవాల్ ఈ సినిమాకి స్టంట్స్ కంపోజ్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రంలో వ‌రుణ్‌తేజ్ బాక్సర్‌గా సరికొత్త గెటప్‌లో క‌నిపించనున్నాడు.ఈ పాత్ర కోసం వ‌రుణ్ అమెరికాలో బాక్సింగ్‌లో శిక్ష‌ణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న విడుద‌ల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించనుందని తెలుస్తోంది. తన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా ‘బ్యాక్ టు సెట్స్.. వైజాగ్‌లో తొలిరోజు చిత్రీకరణ.. మీ అందరి ప్రేమ కావాలి’ అంటూ వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Related posts