telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాక్సర్ గా మెగా ప్రిన్స్… మేకోవర్ కోసం ముంబై

Varun-Tej

మెగా హీరో వరుణ్ తేజ్ ఈ ఏడాది “ఎఫ్-2”, “గద్దలకొండ గణేష్” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వరుణ్ మరో వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాబోయే కొత్త చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అల్లు వెంకటేష్, ముద్దా సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు వ‌రుణ్ తేజ్. ఈ క్ర‌మంలో బాక్సింగ్ శిక్ష‌ణ కోసం రెండు నెల‌ల పాటు ముంబై వెళ్ళ‌నున్న వ‌రుణ్ తేజ్ డిసెంబ‌ర్‌లో తిరిగి హైద‌రాబాద్‌కి వ‌స్తాడ‌ట‌. ఆ త‌ర్వాత చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్.

Related posts