telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న స్టార్ హీరో

Varun

1995లో వచ్చిన “కూలీ నెం 1” అనే బ్లాక్ బస్టర్ సినిమాను అదే టైటిల్‌తో సీక్వెల్ తీస్తున్నారు డేవిడ్ ధావన్. ఇందులో వరుణ్‌ ధావన్ కు జోడీగా సారా అలీ ఖాన్ నటిస్తున్నారు. రూ.65 కోట్లు పెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకే అన్నీ రియలిస్టిక్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. 2020 మే 1న సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కాగా కూలీ నెం 1 సినిమా షూటింగ్‌లో వరుణ్ త్రుటిలో తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పుణెలో జరుగుతోంది. అక్కడి శివారు ప్రాంతాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోయలో పడిపోయేందుకు రెడీగా ఉన్న కారులో వరుణ్‌కు సంబంధించిన క్లోజప్ షాట్స్ షూట్ చేయాల్సి ఉంది. షాట్ ఓకే అయ్యాక వరుణ్ కారు డోర్ తీసుకుని బయటికి దూకేయాలి. కానీ కారు తలుపులు ఇరుక్కుపోవడంతో ఆయన అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకొద్దిసేపు అక్కడే ఉండి ఉంటే కారుతో పాటు వరుణ్ లోయలో పడిపోయి ఉండేవాడట. ఈ స్టంట్ చేయడానికి ముందు ప్రొఫెషనల్స్ సమక్షంలో చాలా సార్లు రిహార్సల్స్ చేశారట. అన్ని సార్లు షాట్ బాగానే వచ్చింది కానీ వరుణ్ ధావన్‌తో తీయాల్సిన ఫైనల్ షాట్‌ మాత్రం రిస్కీ అయిపోయింది. కదలకుండా కారులోనే ఊపిరి బిగపట్టి కూర్చున్న వరుణ్‌ని అక్కడే ఉన్న స్టంట్ కోఆర్డినేటర్స్ చాకచక్యంగా బయటికి లాగారు. మొత్తానికి ఆయన ప్రాణాలతో బయటపడ్డాడని వరుణ్ తండ్రి, డైరెక్టర్ డేవిడ్ ధావన్ తెలిపారు.

Related posts