telugu navyamedia
సినిమా వార్తలు

నా చిత్రం ట్రైలర్ .. కన్నీళ్లు తెప్పిస్తుంది అంటున్న వర్మ..

RGV
రేపు ప్రేమికుల రోజు, ఈ సందర్భంగా వర్మ తన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అది చూసి మీరు కన్నీళ్లు పెట్టుకుంటే, నేను బాద్యుడిని కాదంటున్నాడు వర్మ. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నట్లు వర్మ తెలిపారు. ఇందులో నిజాల్ని చూపించబోతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. రేపు ఉదయం 9.27 గంటలకు ప్రచార చిత్రాన్ని విడుదల చేయబోతున్న నేపథ్యంలో వర్మ ట్వీట్‌ చేశారు.
‘ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ ఇళ్ల దగ్గరలో ఉన్న గుళ్లలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. ఉదయం 9:27 గంటల కల్లా మీ ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు’ అంటూ వీక్షకుడ్ని భావోద్వేగానికి గురి చేస్తానని వర్మ చెప్పారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రను పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు ఒకరు పోషిస్తున్నారు. ఆయన పేరును వర్మ వెల్లడించలేదు. లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తున్నారు. కల్యాణి మాలిక్‌ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ రికార్డింగ్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22న ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కాబోతున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related posts