telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముహూర్తం మార్చినా.. ఆర్జీవీ విడుదల చేసింది.. ఎన్టీఆర్ పాత్రని…

Lakshmi's-NTR

ఎన్టీఆర్ వర్ధంతి రోజున సాయంత్రం 5 గంటలకు వర్మ తాను నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రాణం పోసుకుంటుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ ముహూర్తం మార్చేసి, ఇంతహడావుడి చేసి, ఆయన వదిలింది.. తన చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని. దీనిని బట్టి వర్మ పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇందులో విషయం ఏమిలేదని అర్ధం అవుతుంది. ఇక ఆయన చిత్రం కూడా అంతే ఉండనుందేమో.. అనిపిస్తుంది చూడబోతే.

ఇక ముహూర్తం మార్పుకు ఆయన చెప్పిన కారణం బేషుగ్గా ఉంది. నిద్ర పోనీ వర్మకు కల రావడం, అందులో ఎన్టీఆర్ కనిపించడం, ఎంత వింతో.. కలికాలం. ఇంతకీ ఆయన చెప్పిన కారణం : ఈ ముహూర్తం మారిందని, ఎన్టీఆర్ తనకు కలలో కనబడి చెప్పాడని, ఈరోజు సాయంత్రం 5 గంటలకు బదులుగా 6.57 గంటలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దివ్యముహూర్తం నిర్ణయించడం జరిగిందని వర్మ పేర్కొన్నారు. 6 5 7= 18 అని, 1 8=9 అని.. ఎన్టీఆర్ కు పవిత్రమైన సంఖ్య ‘9’ అని వర్మ వివరించి చెప్పడం గమనార్హం.

Related posts