telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. ట్రైలర్…

RGV

దివంగత ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలతో “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను తెరకెక్కిస్తున్నాడు వర్మ. కళ్యాణ్ మాలిక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ముందుగా చెప్పినట్టుగా నేడు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశాడు వర్మ. అలాగే అన్ని వార్తాపత్రికలలో ఫుల్ పేజీ ప్రకటన కూడా ఇచ్చినట్టుగా వర్మ ట్వీట్ ద్వారా పేర్కొనడం విశేషం. ఇక 22వ తేదినుండి ఈ ట్రైలర్ థియేటర్లలో కూడా చూస్తారని ఇప్పటికే వర్మ ఘంటాపధంగా చెప్పేశాడు, ఏమంటే అదే రోజున క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ చిత్రం చూసేందుకు థియేటర్ లకు వచ్చేవారందరు కూడా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రీకల్ ట్రైలర్ చూస్తారు.

Related posts