telugu navyamedia
సినిమా వార్తలు

త్వరలో ఏపీలో విడుదల చేస్తాం: వర్మ

Ram gopal Varma Fire Censor board
లక్ష్మీఎస్ ఎన్టీఆర్  సినిమా విడుదలను ఏపీలో అడ్డుకోవడం పట్ల ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. ఈరోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఒక సినిమాను కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే విడుదల చేయనివ్వకపోవడమనేది ఎవ్వరూ ఊహించి ఉండరన్నారు. ఇది చరిత్రలోనే మొదటిసారి జరిగిందన్నారు.  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’సినిమా తీయాలని నేను నిర్ణయించుకున్నప్పుడు రాకేశ్‌ రెడ్డి వైసీపీ నాయకుడని నాకు తెలీదని అన్నారు. కొందరు చేస్తున్న ఒత్తిళ్ల వల్ల సినిమాను ఏపీలో విడుదల కానివ్వలేదని ఆయన ఆరోపించారు. 
కోర్టు సినిమాను నిలిపివేయాలని తీర్పునిచ్చింది కాబట్టి ఒక పౌరుడిగా నేను న్యాయస్థానంతో ఏకీభవించానని చెప్పారు. నేను రాకేశ్‌, డిస్ట్రిబ్యూటర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నాం. మొత్తంగా ఇవాళ సినిమాకు వచ్చిన స్పందన బాగుందని చెప్పగలను. త్వరలో ఏపీలోనూ సినిమాను విడుదల చేయడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

Related posts