telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

వర్మ హైదరాబాద్ కంపెనీ .. సినిమా స్టంటేనా..

varma hyd company as movie stunt

25 ఏళ్ళు ముంబైలోనే ఉన్న ఆర్జీవీ అక్కడ వరుస డిజాస్టర్లు పడడంతో అక్కడ కంపెనీని మూసేసి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడు. ఆ సమయంలోనే ఇక్కడ నాగార్జున మేనల్లుడు సుమంత్ ని వెండితెరకు పరిచయం చేస్తూ ప్రేమ కథ తీశాడు. ఆ తర్వాత హిందీ పరిశ్రమలో సినిమాలు తీస్తూనే.. హైదరాబాద్ లో ఓ ఆఫీస్ ని ఓపెన్ చేశాడు. ఇక్కడ రక్త చరిత్ర లాంటి వివాదాస్పద సినిమాలని తెరకెక్కించి తనదైన మార్క్ ప్రచారంతో లైమ్ లైట్ లో కొనసాగాడు. అయితే ఐస్ క్రీమ్.. జీఎస్టీ అంటూ వర్మ చేసిన పిచ్చి ప్రయోగాలన్నీ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. రీసెంట్‌గా లక్ష్మీ స్ ఎన్టీఆర్ సినిమాని లక్ష్మీ పార్వతి కోణంలో చూపించి తీవ్ర దుమారం రేపాడు. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ కుల రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై సినిమా తీస్తున్నాడు.

ప్రస్తుతం వర్మకు హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఆఫీస్ లేదట. తాజాగా సొంత ఆఫీస్ అంటూ ఈయన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. ఈ కొత్త ఆఫీస్ పేరు ‘కంపెనీ’. ఆ ఫోటోలో ఆఫీస్ ఎంతో క్రియేటివ్ గా కనిపిస్తోంది. సైకిల్ చైన్.. తుపాకి కనిపిస్తుండడంతో ఆఫీస్ వర్మ మార్క్ లో ఉందన్న ప్రశంసలు అందుకుంటున్నాడు. హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ ఫోటోలో క్రియేటివిటీ బాగానే ఉంది. కానీ.. సినిమాల్లోనూ అంతే క్రియేటివ్ గా ఆయన ఏ సినిమాలు తీయబోతున్నారు అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. ఆర్జీవీ తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడం లేదని చాలా కాలంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడైనా తన మైండ్ సెట్ మార్చుకొని కాంట్రవర్సీలకు పోకుండా మంచి కథలతో సినిమాలు తీస్తారేమో చూడాలి.

Related posts