telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

పాక్ ప్రధానికి.. రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్..

varma counter to pakistan pm

పుల్వామా ఘటనపై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై దేశం మొత్తం గుర్రుగానే ఉంది. అయితే తాజాగా దీనిపై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా స్పందించాడు. స్పందనలు లేనివాడు కూడా స్పందించాడంటే, ఈ ఘటన ప్రతి భారతీయుడిని ఎంతగా కదిలించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ వర్మ పాక్ ప్రధానికి ఇచ్చిన కౌంటర్ ఏమిటంటే; సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చేది కాదన్న వర్మ.. ఒక వ్యక్తి వందలకొద్దీ పేలుడు పదార్థాలతో భారత్‌ వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతడితో చర్చలు ఎలా జరపాలో మా మొద్దు భారతీయులకు నేర్పాలంటూ సూచించాడు. అదేమీ ఊరికే చేయాల్సిన పనిలేదని, అందుకు భారతీయులందరం కలిసి ట్యూషన్ ఫీజు కూడా చెల్లిస్తామని పేర్కొన్నాడు.

బిన్ లాడెన్ లాంటి వ్యక్తి పాక్‌లో ఉన్న సంగతి మీకు తెలియకున్నా అమెరికాకు తెలుస్తుందన్న వర్మ.. మీది అసలు దేశమేనా? అని ప్రశ్నించాడు. ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని, తమకు కొంచెం తెలివితేటలు నేర్పాలని కోరాడు. జైషే మహ్మద్, లష్కరే తాయిబా, తాలిబన్, అల్‌ ఖాయిదా వంటి ఉగ్ర సంస్థలు మీ ప్లే స్టేషన్లు అని తనకు ఎవరూ చెప్పలేదని అన్నాడు. అయితే, ఆ సంస్థలపై మీకు ప్రేమ లేదన్న విషయాన్ని మీరెప్పుడూ చెప్పలేదని పేర్కొన్నాడు. జైషే మహ్మద్, లష్కరే తాయిబా, తాలిబన్, అల్ ఖాయిదా వంటి సంస్థలను బంతులుగా భావించి పాకిస్థాన్ బౌండరీలను దాటిస్తూ భారత పెవిలియన్‌లోకి పంపుతున్నారని వర్మ ఆరోపించాడు. వాటిని మీరు బంతులనుకుంటున్నారా? లేక, బాంబులనుకుంటున్నారో చెప్పాలంటూ వరుసపెట్టి ట్వీట్లతో ఇమ్రాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌కి దిగాడు.

Related posts