telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జూ.ఎన్టీఆర్ తోనే .. టీడీపీ భవిష్యత్తు …ఓటు వేసుప్పుడు ఆలోచించండి..

RGV

దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీకి భవిష్యత్తు అంటూ మరోమారు ట్వీట్ ద్వారా వేడి రాజేశారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ విజ్ఞప్తి అంటూ ట్వీట్ చేసిన వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్రను చూసిన తర్వాతే నిజాయతీపరులైన, అసలైన ఎన్టీఆర్ అభిమానులంతా ఓటు వేయాలని కోరారు.

ఇంకా టీడీపీకి నారా లోకేశ్ వారసుడు కానేకాదని, తారక్ మాత్రమే అసలైన వారసుడని పేర్కొన్నారు. అతడితోనే టీడీపీకి భవిష్యత్తు అని స్పష్టం చేశారు. అయితే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు వర్మకు కొత్తేమి కాకపోయినప్పటికీ.. ఇది అందరికి తెలిసిందావిషయమే. ఇక సినీ వర్గాలు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల కాకపోవటంతోనే ఏపీ రాజకీయాలలో వర్మ వేలుపెడుతున్నాడు.. లేదంటే ఆయన మానాన ఆయన ఉండేవాడని అంటుండటం విశేషం.

Related posts