క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

వరవరరావు ఇంట్లో పూణే పోలీసుల సోదాలు

varavararao arrest at his home

విరసం నేత, కమ్యూనిస్టు నాయకుడు వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పూణే నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారనే అభియోగంతో వీరిపై కేసులు నమోదయ్యాయి. అయితే… పూణే నుంచి హైదరాబాద్‌కు వచ్చిన పోలీసులు వరవరరావు ఇంట్లోకి చొరబడి ఆయన సెల్ ఫోన్ ను స్విచ్చాఫ్ చేయించి లోపలి నుంచి తాళం వేసి సోదాలు నిర్వహిస్తున్నారు.

 వరవరరావు ఇంటితో పాటు ఆయన కూతురు, ఇఫ్లూ ప్రొఫెసర్‌ సత్యనారాయణ, జర్నలిస్టు కూర్మనాథ్‌, క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో అరెస్టయిన రోనాల్డ్‌ విల్సన్‌ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. పుణెలో నమోదైన కేసులో వీరందరినీ పోలీసులు విచారిస్తున్నారు.

Related posts

ముప్ఫైలు దాటాకే పెళ్లి అంటున్నాడు…విజయ్ దేవరకొండ…

chandra sekkhar

తనీష్ కు హ్యాండ్ ఇచ్చి రూట్ మార్చిన నందిని

jithu j

అసంతృప్తితో ఉన్న నాయకులకు…స్వయంగా కేసీఆర్.. బుజ్జగింపులు…

chandra sekkhar

Leave a Comment