telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వంటలక్క అభిమానులకు గుడ్ న్యూస్… ఆమెకు సినిమాలో ఛాన్స్

Premi-Vishwanath

మలయాళీ నటి ప్రేమి విశ్వనాథ్‌ ‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా వంటలక్కగా పరిచయమై తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే వంటలక్క ఇకపై వెండితెరపై కూడా అలరించనుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే కన్ఫర్మ్ చేశారు. తాను వెండితెరపై నటిస్తున్నట్లు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమి విశ్వనాథ్ (వంటలక్క) చెప్పడంతో ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆతృత కనిపిస్తోంది. లేడి ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఓ తెలుగు మూవీలో తాను పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది వంటలక్క. కరోనా మహమ్మారి వీర విజృంభణ, లాక్‌డౌన్ రావడం కారణంగా కాస్త ఆలస్యమైందని లేకపోతే ఈ పాటికి ఆ మూవీ షూటింగ్ ఫినిష్ అయ్యేదని తెలిపింది. ఇకపోతే తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, అది అనుకోకుండా అలా జరిగిపోయిందని ప్రేమి విశ్వనాథ్ చెప్పింది. బుల్లితెరపై భారీ క్రేజ్ తెచ్చుకున్న వంటలక్క వెండితెరపై కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

Related posts