telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

టీడీపీకి షాక్..తిరిగి వైసీపీలోకి ముఖ్యనేత?

voilance jummalamadugu ycp tdp
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడగా.. తాజాగా మరో సీనియర్ నేత పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ లో చేరతారనుకున్న  విజయవాడ  నేత తిరిగి వైసీపీలోకి వెళ్తున్నారా? వైసీపీ పై నిప్పులు చెరిగిన చెరిగిన ఆ నేత తిరిగి జగన్ పంచన చేరుతున్నారా? వైసీపీ నేతలతో ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే విజ‌య‌వాడ మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా మ‌రోసారి త‌ప్పుడు నిర్ణయం తీసుకుఉంటాడా అనే దాని పై జోరుగా చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే వైసీపీని వీడారో అప్పటి  నుండి రాధా ప‌రిస్థితి అయోమ‌యంగా త‌యారైంది. దీంతో రాధా రాజ‌కీయ భవిష్యత్తు అయోమయంగా మారింది. 
విజ‌య‌వాడ సెంట్రల్  టిక్కెట్ ఆశించిన రాధాకి అక్కడ  గెలిచే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉండ‌డంతో, స్థానం మార్చుకోవాల‌ని  వై ఎస్ జ‌గ‌న్ సూచించారు. అయితే జ‌గ‌న్ సూచ‌న‌ల‌ను అవ‌మానంగా భావించిన రాధా వైసీపీని వీడి జ‌గ‌న్ పై విమర్శల వర్షం కురిపించారు.  ఈ నేపథ్యంలో  రాధా టీడీపీలో చేర‌నున్నార‌నే వార్తలు జోరుగా ఊపందుకొన్నాయి. చంద్రబాబు ఆహ్వానం మేర‌కు రాధా ఆయనతో భేటీ అయ్యారని, రాధాకు చంద్రబాబు ఎమ్మెల్సీ టిక్కెట్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని.. దీంతో టీడీపీలో రాధా చేరిక ఖాయ‌మైందని అందరు భావించారు. 
అయితే తాజాగా చంద్రబాబు ప్రకటించిన  టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్తుల  జాబితాలో రాధా పేరు లేక‌పోవ‌డంతో ఆయ‌న అభిమానుల్లో రాధా రాజ‌కీయ భవిష్యత్తు పై  సుదీర్గ చర్చలు జరుగుతున్నాయి. వైసీపీలో రాధాకు బంద‌రు ఎంపీ సీటు కానీ, విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే సీటు గానీ జ‌గ‌న్ ఆఫ‌ర్ చేశారు. విజ‌య‌వాడ  సెంట్రల్  టిక్కెట్టే కావ‌ల‌ని రాధా పట్టుబట్టడంతో అందుకు జగన్ అంగీకరించకపోవడంతో వైసీపీని వీడారు. వైసీపీ నుంచి  వ‌చ్చిన ఆఫ‌ర్‌ను కాల‌ద‌న్నుకుని, ఇటు చంద్రబాబు  ఆడే రాజకీయ చదరంగం అర్థంకాక  ఇర‌కాటంలో ప‌డ్డార‌ని తెలుస్తోంది. దీంతో వంగ‌వీటి రాధా తాజా త‌న రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ పై ఇటీవల అనుచ‌రులు, స‌న్నిహితుల‌తో స‌మావేశం అయ్యార‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల సమయంలో రాధా వైసీపీని వీడి త‌ప్పు చేశార‌ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

Related posts