telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత

Vangapandu prasad Rao

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు (77) కన్నుమూశారు. విజయనగరం జిల్లా పెదబొండపల్లికి చెందిన వంగపండు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1943లో జ‌న్మించిన వంగ‌పండు ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరుగాంచారు. 1972లో జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో గిరిజనులను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు.

వందలాది జానపదాలకు ప్రాణం పోసిన ఆయనకు 2017లో కళారత్న పురస్కారం లభించింది. వంగపండు మృతి విషయం తెలిసిన వెంటనే విప్లవకవి గద్దర్ స్పందించారు. ఆయనది పాట కాదని, అది ప్రజల గుండె చప్పుడు అని కొనియాడారు. అక్షరం ఉన్నంత వరకు ఆయన జీవించి ఉంటారని అన్నారు.

Related posts