telugu navyamedia
సినిమా వార్తలు

“వనమయూరీ!”

vanamayuri poetry corner
వలపు  తలపుల   సమీరమై-
 నా ప్రేమ జీవనానికి
 మహిమాన్విత శరవ్యమై-
నా హృదిలో పరిమ్లానము కాని
 శాశ్వత పుష్పమై –
ప్రబంధ నాయిక లైన 
“వరూధినీ” విరహం,
“గిరికా దేవి” కలపిక స్వనం,
“రాధ” నాసికాకృతిలో హల విన్యాసం,
 ముమ్మూర్తులా నీలో నింపుకున్న 
ఓ సౌందర్య లహరీ!
నా ప్రణయ ఝరీ!
వనమయూరీ!
ఎన్ని జన్మల బంధమో,
యుగ యుగాల పూజాఫలమో,
మన  రెండు హృదయాల్లో
ప్రేమ వసంతం-
ఇలలో ప్రతి నిమిషం
వలపు నావలో విహారం-
నాకోసం ఉదయించిన 
నవనవోన్మేషమా!
నీతోనే నా శ్వసితం –
నీ తోనే నా సమస్త జీవితం-
నీవు నా ప్రణయ సుగంధం
నీవే  నా  ప్రేమామృత  బంధం
-అంశుమాలి, టెక్కలి 

Related posts