telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

వాముతో వెయ్యి.. ఉపయోగాలు…కొన్నైనా…

vamu and its health benefits

వాము అనగానే, ఆమ్మో మంట.. అని గుర్తుకు వస్తుంది. అయితే బాధవెంటనే సుఖం ఉంటుందన్నట్టు, ఆ మంట తట్టుకుంటే, ఆరోగ్యమే అంటున్నారు వైద్యులు. ఇక దీనిని, భారతీయులు తప్పనిసరిగా వంట ఇంటిలో ఉపయోగిస్తుంటారు. ఇది భారతీయులకు తెలిసిన గొప్ప ఔషధం. సాధారణంగా వామును జంతికలు చేసినపుడు వాడుతుంటాము. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రమే చాలా మందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది. వాములో ఉండే ఔషధ గుణాలు ఏమిటో చూద్దాం.

* జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.

* వాము, ధనియాలు, జీలకర్ర – ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.

* వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.

* వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల రోగం తగ్గుతాయి.

* వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.

* వేయించిన వాము, జీలకర్ర నీటిలో మరిగించి తాగితే ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది.

Related posts