telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాల్మీకి : “హే వక్కా వక్కా…” లిరికల్ వీడియో సాంగ్

Valmiki

హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా “జిగర్తాండ”కు ఈ సినిమా రీమేక్. ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల చేయనున్నారు. ప్రముఖ తమిళ్‌ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక యంగ్ హీరో నితిన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కన్పించనున్నారట. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి “హే వక్కా వక్కా…” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts