telugu navyamedia
సినిమా వార్తలు

“వాల్మీకి” ప్రీ టీజర్

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా “వాల్మీకి” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన “జిగర్తాండ” సినిమాకు ఇది రీమేక్. ఆ సినిమాలో బాబీసింహా పోషించిన పాత్రను వరుణ్ తేజ్, సిద్ధార్థ్ పోషించిన పాత్రను అధర్వ మురళి చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. “వాల్మీకి” చిత్రాన్ని ఆచంట రాము, గోపినాథ్ లు 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా “వాల్మీకి” ప్రీ రిలీజ్ టీజ‌ర్ ని ఈ రోజు విడుద‌ల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ లో వరుణ్ తేజ్ లుక్ సరికొత్తగా ఉంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts