telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వాల్మీకి”కి షాకిచ్చిన పోలీసులు… ఆ రెండు జిల్లాల్లో విడుదలకు బ్రేక్

Valmiki

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మించిన “వాల్మీకి” సినిమా టైటిల్‌ మారింది. సినిమా టైటిల్‌ను “గద్దలకొండ గణేష్”గా మార్చారు. “వాల్మీకి” టైటిల్‌ అభ్యంతరకరంగా ఉందని బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతున్న ఈ చిత్రంలో అధ‌ర్వ ముర‌ళి ముఖ్య పాత్ర పోషించారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించారు. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించారు. ఇప్పటికే “గద్దలకొండ గణేష్” ప్రీమియర్ షోలు యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. అయితే ఈ వివాదం ఇంకా ముగిసినట్టుగా అన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ చిత్రానికి పెద్ద షాక్ ఇచ్చారు పోలీసులు. కర్నూలు, అనంతపురం రెండు జిల్లాలో బోయ సామాజిక వర్గ ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. చిత్రం ఈ రెండు జిల్లాలో విడుదలైతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనే సమాచారంతో రెండు జిల్లాల కలెక్టర్లు పోలీసులకు ఆదేశాలు జారీ చేసారు. దీంతో శాంతి భద్రత దృష్ట్యా ‘వాల్మీకి’ సినిమా విడుదలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ పకీరప్ప ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ బోయ కులస్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతపురం ముందబండపల్లిలో వాల్మీకి షూటింగ్ సమయంలో బోయకులస్థులు చిత్ర యూనిట్‌పై దాడికి దిగారు. ఆ సందర్భంలో షూటింగ్‌ కూడా నిలిపివేశారు. అయితే వివాదం పూర్తిగా సద్దుమణగకుండానే సినిమా విడుదలకు రెడీ కావడంతో శాంతి భద్రత దృష్ట్యా అనంతపురంలో ‘వాల్మీకి’ నో ఎంట్రీ బోర్డ్ పెట్టారు కలెక్టర్. అంతేకాదు కర్నూలు జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన చోట్ల యదావిధిగా ‘వాల్మీకి’ చిత్రం ప్రదర్శితం కానుంది.

Related posts