telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వకీల్ సాబ్ నుండి రానున్న ”సత్యమేవ జయతే”…

ఏప్రిల్ 9న బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న మూవీ ‘వకీల్ సాబ్’. హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ప్రేక్షకులు తెరపై చూసి మూడు సంవత్సరాలు దాటింది. దింతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమూరుస్తున్నారు. అయితే ఇప్పటికే ‘వకీల్ సాబ్’ నుండి వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో పాట విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ”సత్యమేవ జయతే” అని సాగనున్న ఈ పాటను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ రేటుకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని సమాచారం.

Related posts