telugu navyamedia
telugu cinema news trending

వైష్ణవ్ తేజ్ మూవీకి .. టైటిల్ ఖరారు.. ఉప్పెన ..

Mega Hero Vaishav Tej movie launch images

వైష్ణవ్ తేజ్, మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పనులన్నీ చక చకా జరిగిపోతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయమై క్లారిటీ వచ్చేసింది. మంగళూరుకు చెందిన క్రితి శెట్టి ని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన క్రితి శెట్టి సౌత్ లో మెప్పించింది. తెలుగులో మెగా ఫ్యాలీ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు ‘ఉప్పెన’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా లేటెస్త్ అప్డేట్. అంతేకాదు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నాడు.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఈ సినిమాతోనే టాలీవుడ్ కు క్రితి శెట్టి కూడా పరిచయం అవ్వబోతుంది. మే 25న ఈ సినిమాను ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ హీరోగా స్టార్ డం ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.

Related posts

కొత్త ట్రాఫిక్ నిబంధనలు : .. పిల్లలకు వాహనాలు ఇస్తే.. జైలే… లైసెన్సు కూడా రద్దు

vimala p

భారత సారధి.. హిట్‌మ్యాన్‌ ను ఇంటర్వ్యూ చేశాడట..

vimala p

హీరోయిన్ ను విలన్ గా మారుస్తున్న దర్శకుడు

vimala p