telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్రాన్స్‌జెండర్ పాత్రలో హీరోయిన్

Vani

బాలీవుడ్ హీరోయిన్ వాణీకపూర్ తొలిసారిగా ఛాలెంజింగ్ రోల్ ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించబోతోంది. జాతీయ అవార్డు గ్రహీత ఆయుష్మాన్ ఖురానా సరసన ‘చండీగర్ కరే ఆషికి’ అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది వాణికపూర్. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో వాణీ కపూర్ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ఓ ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడతాడట. ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన వాణీకపూర్ తొలిసారి ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనుందట. ఇప్పటివరకు హీరోలే ట్రాన్స్‌జెండర్‌గా కనిపించగా… తొలిసారి ఓ హీరోయిన్‌ అలాంటి పాత్ర చేయడం సాహసమనే చెప్పొచ్చు. కాగా నేచరల్ స్టార్ నాని సరసన ‘ఆహా కల్యాణం’లో నటించింది వాణీకపూర్. ఆ సినిమా ప్లాప్ కావడంతో ఆమెకు మరో ఛాన్స్ దక్కలేదు. దీంతో బాలీవుడ్‌కే పరిమితమైన ఈ పొడుగుకాళ్ల సుందరి ‘బేఫికర్‌’, ‘వార్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ సరసన ‘బెల్ బాటమ్’ చిత్రంలో నటిస్తోంది ఈ బ్యూటీ.

Related posts