telugu navyamedia
political Telangana

కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పోలీసులు అనుకూలంగా!

V Hanumantha Rao
కూకట్‌పల్లి నియోజకవర్గంలో  పోలీసు అధికారులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ నేత వీ హనుమంత రావు అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్‌కు అంత భయమెందుకని సూటిగా అడిగారు. పోలీసులు కూడా టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేయండని చెబుతున్నారని ఆరోపించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంటిపైకి 50 మంది పోలీసులను పంపి దాడులు చేయించడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. 
సీఎం కేసీఆర్‌ ఇంటిపై, ప్రగతి భవన్‌పై పోలీసులు దాడులు చేయమంటే చేస్తారా అని ప్రశ్నించారు. 108,104 వాహనాల్లో డబ్బులు, మద్యం తరలిస్తున్నారని, కాంగ్రెస్‌, తెలుగుదేశం కార్యకర్తలు 108,104 వాహనాలను తనిఖీలు చేయాలని సూచించారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. మహిళలని కూడ చూడకుండా పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.

Related posts

బ్రెజిల్ లో ఆనకట్ట కూలి.. 19 మృతి, 200 గల్లంతు..

vimala p

ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ప్రకటించలేదు: చంద్రబాబు

vimala p

ఇన్ స్పెక్టర్ కూతురిపై.. సామూహిక అత్యాచారం… అదుపులో నిందితులు..

vimala p