telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిర్మాతలకు “సాహో” టీమ్ ఓపెన్ లెటర్

Saaho

“బాహుబ‌లి” చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రం “సాహో”. ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇక చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్ట‌ర్స్, సాంగ్స్ విడుద‌ల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా గురించి యంగ్ రెబల్ స్టార్ అభిమానులే కాకుండా ప్రముఖులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తర్వాతగానీ, ముందుగానీ తమ సినిమా లేకుండా చూసుకుంటున్నారు చిన్న నిర్మాతలు. ఈ సినిమాకు టాక్ ఎలా వచ్చినా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయనడంలో సందేహం లేదు.

ఇక ఇప్పుడు సినిమా యూనిట్ కూడా ఓపెన్ లెటర్ రాసింది. తమ సినిమా విడుదలకు మార్గం సుగమం చేసిన నిర్మాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు యూవీ క్రియేషన్స్. నిజానికి ఆగస్ట్ 15న సాహో విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణాలతో ఈ చిత్రం మరో రెండు వారాలు వాయిదా పడింది. అప్పటికే తెలుగులో నాని గ్యాంగ్ లీడర్.. తమిళనాట సూర్య బందోబస్త్ సినిమాలు ఆగస్ట్ 30న విడుదల కానున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అలాంటి సమయంలో “సాహో” రావడంతో వాళ్లు తప్పుకున్నారు. దాంతో పాటు హిందీలో కూడా రెండు సినిమాలను వాయిదా వేసారు. తమ సినిమా కోసం వాళ్ల సినిమాలను వాయిదా వేసుకున్న నిర్మాతలకు ఇప్పుడు యూవీ క్రియేషన్స్ మనస్పూర్థిగా థ్యాంక్స్ చెప్పుకున్నారు. సాహో ఇంత బాగా విడుదలవుతుందంటే దానికి కారణం మీరే అంటూ వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts