telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

లాయర్ల హత్యలో పోలీసుల పాత్ర ఉంది : ఉత్తమ్

న్యాయవాది వామనరావు దంపతుల హత్యలు తెలంగాణలో సంచలనంగా మారాయి. ఈ హత్యలను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఉదయం గవర్నర్ తమిళిసై ను కలిశారు.  లాయర్ల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.  అనంతరం మీడియాతో మాట్లాడారు.  పోలీస్ కమిషర్ తెరాస నాయకులకు తొత్తులుగా మారిపోయారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.  పోలీసుల పాత్ర డైరెక్ట్ గా లాయర్ల హత్యలో ఉందని, స్థానిక పోలీసుల విచారణలో నిజం బయటకు రాదనీ, కేసును సీబీఐకి అప్పగించాలని అన్నారు.  కోర్టు పరిశీలనలో సీబీఐ విచారణ జరగాలని అన్నారు.  లాకప్ డెత్ కేసులో లాయర్లను పోలీసులే బెదిరించారని, కోర్టులో ఇది రికార్డ్ అయ్యిందని తెలిపారు.  లాయర్ల హత్యను న్యాయవ్యవస్థపై దాడిగా చూస్తున్నామని అన్నారు.  ప్రభుత్వం కనీసం లాయర్ల డిమాండ్ కూడా పట్టించుకోవడం లేదని ఉత్తమ్ విమర్శించారు. లాయర్ వామనరావు చనిపోతూ పుట్టా మధు పేరు కూడా చెప్పినట్లు స్థానికులు చెప్పారని, పుట్టా మధు సీఎం కి దగ్గర కావడంతో పోలీసులు  పట్టించుకోవడం లేదని అన్నారు. చూడాలి మరి దీని పై వారు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts