telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కమీషన్ల కోసమే టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోంది..

uttam congress mp

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయానికి ప్రణాళికబద్ధంగా పనిచేయాలని ఆ పార్టీ నేతలు తీర్మానించారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో డా. శ్రవణ్ కుమార్ నివాసంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ అధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి, పొన్నం ప్రభాకర్, బోసిరాజు, తదితర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలో వ్యవహరించాల్సిన విధివిధానాలపై చేగుంట మండల ఇన్ఛార్జ్ లకు నేతలు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది.. తెలంగాణ రాష్ర్టం ఇచ్చింది.. కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. కమీషన్ల కోసమే టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోందని ఆరోపించారు. ప్రస్తుత పాలకులు దేశాన్ని మతం పేరుతో విభజిస్తున్నారని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని సూచించారు.

Related posts