telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూరి జగన్ అని కొత్త కుర్రాడు.. యాక్టింగ్ ఇర్రగ్గొట్టేశాడు : రామ్

Ismart-Shankar

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ “ఇస్మార్ట్ శంకర్” అద్భుతమైన కలెక్షన్లు సాధించి దూసుకుపోతుంది. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటించారు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఈ సినిమాకి ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ పాటలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ సీన్‌ని రామ్ దర్శకత్వం వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సినిమా నిర్మాత ఛార్మి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రామ్ “ఓ కొత్త యాక్టర్‌ని డైరెక్ట్ చేయబోతున్నాను” అని చెప్పటం మనం చూడవచ్చు. అయితే ఈ ట్వీట్‌ని రామ్ రీట్వీట్ చేశాడు. “పూరి జగన్ అని కొత్త కుర్రాడు.. యాక్టింగ్ ఇర్రగ్గొట్టేశాడు” అంటూ రామ్ పేర్కొన్నాడు. అయితే రామ్‌కి పూరి కూడా ఫన్నీగా రిప్లే ఇచ్చాడు. ‘‘సార్.. నెక్ట్స్ టైం కొంచెం పెద్ద రోల్ ఇవ్వండి సార్ ప్లీజ్’’ అంటూ పూరి పేర్కొన్నారు.

Related posts