telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక సామాజిక

ప్లాస్టిక్ స్ట్రా తో సమస్యలు.. ఎకో స్ట్రాలు.. వినియోగం పెరగాలి..!

use other sources instead plastic straws

ప్రపంచంలోని సముద్ర వ్యర్థాల్లో 80 శాతం మైదాన ప్రాంతం నుంచి చేరుతున్నవేనని తెలిపారు. ఇందులో 80 నుంచి 90 శాతం వ్యర్థాలు ప్లాస్టిక్ రూపంలో ఉంటున్నవేనని, ఇందులో స్ట్రాల పాత్ర అత్యధికమని తెలిపారు. ఈ వ్యర్థాలు భూమిలో కరిగేందుకు 500 కంటే ఎక్కువ ఏండ్ల సమయం తీసుకుంటుందని తన నివేదికలో పేర్కొంది. తాజాగా నగరంలో ప్యాకేజింగ్ రంగానికి సంబంధించి జరిగిన ఓ జాతీయ స్థాయి సదస్సులో ప్లాస్టిక్ స్ట్రాలను వీడాలని, పర్యావరణ హితమైన స్ట్రాలను మాత్రమే వినియోగించాలన్న సందేశాన్ని బలంగా వినిపించారు. రాబోయే కొన్నేండ్లలో ప్లాస్టిక్ స్ట్రాలకు ప్రత్యామ్నాయంగా పేపర్, వెదురు, కాపర్ వినియోగం పెరిగే వీలుందని, ఆ విధంగా పర్యావరణ హితమైన స్ట్రాల తయారీ పరిశ్రమల సంఖ్య మన దేశంలో గణనీయంగా పెరిగి ఈ రంగం ద్వారా విస్తృత ఉపాధికి కూడా అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఒక్క కొబ్బరిబొండాల వినియోగానికి మన దేశంలో ప్రతిరోజూ 5 లక్షల స్ట్రాలను వినియోగిస్తున్నట్టు అంచనా. ఇతర శీతల పానీయాల విషయానికొస్తే వీటి సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. అయితే ఈ ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో పేపర్, వెదురు స్ట్రాలను వినియోగించే విషయంలో నగరానికి చెందిన ఐటీసీ గ్రాండ్ కాకతీయ వంటి హోటళ్లు ముందడుగు వేశాయి. ప్లాస్టిక్ స్ట్రాలతో పోల్చిచూస్తే పర్యావరణహితమైన స్ట్రాల ధర కొంత ఎక్కువే. శీతల పానీయాలను సమర్థవంతంగా తట్టుకొనే స్థాయిలో పేపర్ స్ట్రాలు తయారవ్వాలంటే యేటా 3వేల టన్నుల పేపర్‌ను వినియోగించాలని ఐటీసీ పేపర్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎన్.వెంకటరామన్ తెలిపారు.

use other sources instead plastic strawsజలజీవాలకు ప్లాస్టిక్ వ్యర్థాలు శాపంలా పరిణమిస్తున్నాయి. అయితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాల్లో 11వ అత్యంత ప్రమాదకర వస్తువుగా స్ట్రా నిలుస్తున్నది. జాతీయ స్థాయిలో పలు స్వచ్ఛంద సంస్థలు ప్లాస్టిక్ స్ట్రాల వినియోగానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారానికి సానుకూల స్పందన వస్తున్నది. ఇప్పటికే ప్లాస్టిక్ స్ట్రాలు తయారు చేస్తున్న అనేక సంస్థలు ప్రత్యామ్నాయ స్ట్రాల తయారీకి పూనుకున్నాయి. ఈ తరహా పరిశ్రమలు మహారాష్ట్రలో అధికంగా ఉన్నాయి. ఢిల్లీలోని గుర్గావ్ ఆరావలికి చెందిన విద్యార్థులు కొందరు ప్లాస్టిక్ స్ట్రాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపట్టి దాదాపు 2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి కొన్ని వందల సంస్థల ద్వారా ప్రత్యామ్నాయ స్ట్రాలను వినియోగించేలా చేశారు.

Related posts