telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

లేత వయసులో ఆడవారు.. లేటు వయసులో మగవారు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా.. వాడేస్తున్నారట..!

usage of smart phone in different age groups and lock

బ్రిటిష్‌ కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు స్మార్ట్‌ఫోన్‌ లాక్ చేసే విధానం ఆధారంగా మీ వయసు ఎంతో చెప్పేవచ్చునని అంటున్నారు . అదెలా అనుకుంటున్నారా. చిన్న విషయం చూద్దాం. పాతతరం స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఫోన్‌ తనంతట తానే లాక్‌ అయిపోవాలని కోరుకుంటే.. కొత్తతరం వాళ్లు దీనికి భిన్నమైన ఆలోచన చేస్తారని ఈ అధ్యయనం చెబుతోంది. అంతేకాకుండా పాతతరం వాళ్లు పిన్‌ నెంబర్‌ను వాడితే.. కొత్తతరం వాళ్లు వేలిముద్రలు వాడతారు. స్మార్ట్‌ఫోన్ల వాడకానికి వయసుకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించేందుకు జరిగిన తొలి అధ్యయనం ఇదేనని అంటున్నారు కాన్‌స్టాంటిన్‌ బెజ్నోసోవ్‌ అంటున్నారు. వయసు మళ్లినవారు తమ స్మార్ట్‌ఫోన్‌ను అప్పుడప్పుడూ అన్‌ లాక్‌ చేస్తూంటారని చెప్పారు.

ఇతరులు మన స్మార్ట్‌ఫోన్లను వాడకుండా చూసేందుకు ఏం చర్యలు తీసుకోవాలన్న విషయంపై తాము పరిశోధనలు చేశామని, ఈ క్రమంలో ఫోన్ల వాడకం తీరుతెన్నులు తెలిశాయని, వీటి ఆధారంగా భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్లను ఎలా డిజైన్‌ చేయాలో అంచనా వేయవచ్చునని బెజ్నోసోవ్‌ తెలిపారు. తాము 19 నుంచి 63 మధ్య వయసు వారిపై అధ్యయనం జరిపామని… వీరందరి ఫోన్లలో ప్రత్యేక అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసి రెండు నెలలపాటు పరిశీలన చేసినప్పుడు వీరందరూ ఏ సందర్భాల్లో లాక్‌ చేస్తారు? అన్‌లాక్‌ చేస్తారు..అన్న విషయం తెలిసింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం స్మార్ట్‌ఫోన్లు వాడతారని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని.. 50 ఏళ్ల వయసులో మగవారు ఎక్కువగా ఫోన్‌ వాడితే.. మహిళలు తక్కువ వాడతారని బెజ్నెసోవ్‌ వివరించారు.

Related posts