telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గ్రహాంతర వాసులు ఉన్నారంటూ .. నిర్దారిస్తున్న అమెరికా …

USA navi on UFOs in a video viral

ఏ గ్రహంపై ఎన్ని ప్రయోగాలు చేసినా వాటిపై జీవరాశి ఉందా లేక ఉండగలదా అనేది తెలుసుకోడానికే. మరి భూగ్రహ వాసులు ఈ ప్రయోగాలు చేస్తుంటే, ఇతర గ్రహస్తులు మాత్రం ఊరికే ఉంటారా.. వాళ్ళు మన గ్రహంపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. వీటిపై ఇప్పటికే పలు ఆసక్తికర చిత్రాలు కూడా ఎన్నో వచ్చాయి. కాకపోతే అవి సినిమాలు కాబట్టి వ్యాపార దృక్పధంతో ఉంటాయి కానీ, వాస్తవానికి దగ్గరగా ఉండవు. అయితే అమెరికా మాత్రం గ్రహాంతర వాసులు ఉన్నట్టు స్పష్టం చేస్తుంది. ఇది నిజం అంటూ వీడియోలు కూడా చూపిస్తుండటం కొసమెరుపు.

ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు గానీ గత కొద్ది సంవత్సరాలుగా గ్రహాంతరవాసులు భూమిపైన వారి వాహనాలు అనగా యు.ఎఫ్.ఓ లు వేసుకొని తిరుగుతున్నట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. సాసర్ లాగా ఉండే వాటి ఆకారం మనందరికీ తెలిసిందే. అయితే అవి ఒట్టి కల్పిత రూపాలా లేక నిజమా అన్నది ఇప్పటికీ ప్రతి ఒక్కరికి సందిగ్ధమే. కానీ తాజాగా అమెరికన్ నావికా దళం విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు విడుదలైన మూడు వీడియోలలో కనిపించినవి యు ఎఫ్ ఓ లేనట. వారు చెప్పినది ఏమిటంటే ఈ వీడియోలు తాము ఎన్నటికీ బయటకు రాకూడదు అని అనుకున్నామని…. లేకపోతే దురదృష్టవశాత్తు అవి కాస్తా లీక్ కాగా ఇప్పుడు వాటిని నిర్ధారించాల్సిన అవసరం వచ్చిందని వారు అన్నారు.

అమెరికా కు చెందిన ఒక మీడియా సంస్థ గాల్లో ఎగిరే యు.ఎఫ్.ఓ ల పై ఇన్నిరోజులు వాటిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో యూ.ఎస్ నావికా దళం సరికొత్త ప్రయోగంగా వీటిని ప్రయోగించి ఉంటుందని సందేహాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై తప్పని పరిస్థితుల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న నావికా దళం అవి తమకి సంబంధించినవి కాదని…. మన భూమికి వాటికి ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. ఇకపోతే విడుదలైన వీడియోలలో 2004లో క్యాలిఫోర్నియా తీరంలో కనపడిన ఒక యు.ఎఫ్.ఓ భూమి నుండి 60 వేల అడుగుల ఎత్తు నుండి 50 అడుగుల కు రెప్పపాటులో వచ్చి సముద్రంలో ఫుట్బాల్ మైదానం అంత అలజడి సృష్టించింది. కాబట్టి మొట్టమొదటి సారి గ్రహాంతరవాసులు ఉన్నారు అన్న విషయం పై నిర్ధారణ వచ్చేసిందన్నమాట. ఇక మిగిలింది వారిని వెతకడమే.

Related posts