telugu navyamedia
రాజకీయ వార్తలు

అమెరికాలో ఐసొలేషన్ 10 రోజులు మాత్రమే!

china found vaccine for corona virus

కరోనా వైరస్ భాదితుల నిబంధనల్లో అమెరికా మార్పులు చేసింది. వైరస్ సోకితే ఇప్పటివరకూ పాటించాల్సిన 14 రోజుల ఐసొలేషన్ ను 10 రోజులకు కుదించింది. ఈ మేరకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిబంధనలను మార్చింది. ఈ సంవత్సరం మార్చి నుంచి అమెరికాను వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇక కరోనా పాజిటివ్ వచ్చి, ఎటువంటి లక్షణాలూ లేని వారు ఎప్పుడు బయటకు వెళతామా అని క్షణాలు లెక్కపెట్టుకుంటూ వుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిపై పరిశోధనల తరువాత వచ్చిన నివేదికలను పరిశీలించిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొన్ని సిఫార్సులు చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన, జ్వరం బయటపడిన 24 గంటలలోపు నుంచి 10 రోజుల పాటు రోగులు ఐసోలేషన్ అయితే సరిపోతుందని పేర్కొంది. ఇప్పటివరకూ రెండు సార్లు నమూనాలు ఇచ్చి, అవి నెగటివ్ వస్తేనే ఐసొలేషన్ నుంచి బయటకు రావాలన్న నిబంధన అమలులో ఉండేది.

Related posts