telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రివ్యూ తప్పుగా ఇచ్చాడని..?

రివ్యూ తప్పుగా ఇచ్చారని అక్కడ జైలు శిక్ష విధించారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఓ హోటల్ కు రివ్యూ బాగాలేదు అని ఇచ్చాడట. ఆ కారణంగా పోలీసులు అతనిపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఈ సంఘటన థాయిలాండ్ లోని కో చాంగ్ లో జరిగింది థాయిలాండ్ లోని కో చాంగ్ ఐలాండ్ కు ఇటీవలే అమెరికాకు చెందిన వెస్లే బార్న్స్ అనే వ్యక్తి ఎంజాయ్ చేసేందుకు వెళ్ళాడు. కో చాంగ్ లోని సి వ్యూ కో చాంగ్ రిసార్ట్ కు వెళ్ళాడు. అక్కడ వెస్లే వైన్ బాటిల్ ఆర్డర్ చేయగా బిల్లుతో పాటుగా సర్వీస్ ఛార్జ్ కింద 15 యూఎస్ డాలర్లు వేశారు. దీంతో వెస్లే హోటల్ యాజమాన్యంతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎట్టకేలకు సర్వీస్ ఛార్జ్ ను తీసేసి బిల్లు ఇచ్చారు. అయితే, వెస్లే ఆ హోటల్ గురించి చెడుగా రివ్యూ ఇచ్చాడు. హోటల్ ద్వారా కరోనా వ్యాపిస్తోందని, ఎవరూ వెళ్లోద్దని చెప్తూ రివ్యూ ఇచ్చాడు. దీంతో హోటల్ యాజమాన్యం అతని పై కేసు వేసింది. దీంతో పోలీసులు వెస్లేను అరెస్ట్ చేశారు. రెండు రోజులు జైల్లో ఉన్న వెస్లే బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. ఈ కేసులో వెస్లేకు గరిష్టంగా రెండేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష అని ఈ విషయం తెలిసిన వారు అనుకుంటున్నారు.

Related posts