telugu navyamedia
రాజకీయ వార్తలు

న‌వంబ‌ర్ లో అమెరికా ఎన్నిక‌లు: ట్రంప్‌

trump usa

అమెరికాలో దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు య‌ధావిధిగా తేదీనే జ‌రుగుతాయ‌ని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం ఆయ‌న వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌ న‌వంబ‌ర్ 3వ తేదీనే జ‌రుగుతాయ‌ని ట్రంప్ అన్నారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఓట‌ర్లు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయ‌డం కొంత ఆందోళ‌న క‌లిగించే విష‌యమే. కానీ, ఈ-మెయిల్ ద్వారా ఓటింగ్ వేసే ప్ర‌క్రియ‌ను ట్రంప్ వ్య‌తిరేకించారు.

ఈమెయిల్ ఓటింగ్ వ‌ల్ల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని ట్రంప్ అన్నారు. ఈమెయిల్ ఓటింగ్‌తో చాలా మంది మోసం చేస్తార‌న్నారు. బూత్‌కు వెళ్లి గ‌ర్వంగా ఓటెయ్యాల‌న్నారు. ఓట‌రు ఐడీతోనే ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌న్నారు. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా దూసుకువెళ్తున్న మాజీ ఉపాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ మాత్రం ప్ర‌జ‌ల‌ను ఈమెయిల్ ఓటింగ్‌కు సిద్ధం కావాలంటూ సూచిస్తున్నారు. క‌రోనా మ‌హమ్మారి నేప‌థ్యంలో ఈమెయిల్ ఓటింగ్‌కు అవ‌కాశాలు ఉన్న‌ట్లు బైడెన్ తెలిపారు.

Related posts