telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అమెరికా, యూరప్‌ కారణంగా భారత్‌లో కోవిషీల్డ్‌ ఉత్పత్తికి ఆటంకం…

corona vacccine covid-19

మన దేశంలో ఈ ఏడాది ఆర్భం నుండి కరోనా వైస్సాక్షిణ్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు అమెరికా, యూరప్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉండడం వల్ల భారత్‌లో కోవిషీల్డ్‌ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందన్నారు ఎస్ఐఐ సీఈవో అదర్‌ పునావాలా. ఈ రెండు దేశాలు… వ్యాక్సిన్‌ తయారీకి అత్యంత అవసరమైన ముడిసరుకు ఎగుమతిని నిషేధించాయని, దీంతో భారత్‌లో కోవిషీల్డ్‌ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందన్నారు. ప్రతి నెలా 10 నుంచి 11 కోట్ల మోతాదులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు ఆయన. అయితే, అందుకు తగ్గ రా మెటీరియల్‌ అందకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. నాణ్యతలో సమస్యల కారణంగా చైనా నుంచి కూడా ముడి పదార్థాన్ని దిగుమతి చేసుకోలేని పరిస్థితి ఉందన్నారు పునావాలా.  అయితే, ఇది స్వల్పకాలికమే అయినా.. తాము చాలా కష్టపడుతున్నాం అన్నారు. ఇక మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతున్న… కేసులు మాత్రం తగ్గడం లేదు.

Related posts