telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పుష్ప మూవీలో బాలీవుడ్‌ భామ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్పా. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని తెగ కష్టపడిపోతున్నారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మెస్తోంది. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా మందన్న బన్నీ సరసన నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు విలన్ దొరకలేదు. ఈ సినిమాలో విలన్ కోసం చిత్రం బృందం గాలింపులు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో విలన్ పాత్రకు ముందుగా తమిళ హీరో విజయ్ సేతుపతిని అనుకున్నారట, అతడు అందుబాటులో లేకపోవడంతో అతడిపై ఆశలు వదిలేశారు. దాని తరువాత విలన్ కోసం జల్లెడ వేస్తున్న సుకుమార్‌ ఇటీవల ఆర్యాను సంప్రదించాడట. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఈ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ భామ ఊర్వశీ రౌతేలను పుష్ప చిత్ర యూనిట్‌ సంప్రదించినట్లు సమాచారం. భారీ రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేయడంతో ఊర్వశి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్‌ కూడా షూటింగ్‌ జరుపుకోనుందట.

Related posts