telugu navyamedia
సినిమా వార్తలు

మరోసారి సర్జికల్ స్ట్రైక్… ఉచితంగా చూసే అవకాశం

URI

యురి సెక్టార్‌ లోని ఆర్మీ స్థావరంపై టెర్ర‌రిస్ట్‌ల ఎటాక్‌కి ప్ర‌తీకారంగా ఇండియ‌న్ ఆర్మీ జ‌రిపిన‌ సర్జిక‌ల్ స్ట్రైక్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం “యురి : ది సర్జికల్‌ స్ట్రయిక్‌”. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆదిత్య దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రొన్ని స్క్రూవాలా చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఆయ‌న స‌ర‌స‌న యామీ గౌత‌మ్ క‌థానాయిక‌గా న‌టించింది. 45 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో పరేశ్ రావల్, రజిత్ కపూర్, కృతి కుల్హరి కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 200 కోట్ల వ‌సూళ్ళు ఈ చిత్రం రాబ‌ట్టింది. చిత్రంలో విక్కీ కౌశ‌ల్‌.. పాకిస్థాన్ టెర్ర‌రిస్ట్‌ల‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేసే టీం క‌మాండ‌ర్ చీఫ్ పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేశాడు. యురి చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డంతో పాటు భార‌త ప్ర‌ధాని ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని జులై 26న కార్గిల్‌ దివస్‌ను పురస్కరించుకుని మళ్లీ విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. ఆ ఒక్కరోజు మాత్రమే సినిమాను మ‌హారాష్ట్ర మొత్తం ప్రదర్శించనున్నట్లు నిర్మాత రోన్నీ స్క్రూవాలా మీడియా ద్వారా వెల్లడించారు. ఆ రోజు సినిమాని ఉచితంగా చూసే అవ‌కాశం కూడా క‌లిపిస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

Related posts