telugu navyamedia
తెలంగాణ వార్తలు విద్యా వార్తలు సామాజిక

ఉచిత సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

Degree exams TDP questiona Anantapur

తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2019-20 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న యూపీఎస్‌సీ-సీ శాట్ (సివిల్ సర్వీసెస్) ఉచిత శిక్షణకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీఎస్ ఎస్‌సీ స్టడీ సర్కిల్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.బాలసురేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు www. tsstudycircle.telangana.gov.in లో ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఏదైనా జనరల్ లేదా ప్రొఫెషనల్ కోర్సులలో డిగ్రీ పూర్తి చేసిన 250మంది ఉమ్మడి జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన స్త్రీ, పురుషు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్సీలకు 75శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలకు 15శాతం కేటాయించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ప్రాథమిక పరీక్షను జూన్ 9న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు వినియోగించుకోవాలని తెలిపారు.

Related posts