telugu navyamedia
సినిమా వార్తలు

ఉపాసన కొత్త ఉద్యోగం… !?

Upsana

టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొత్త ఉద్యోగంలో చేరారు. అంతేకాదు నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది సార్? అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశాలకు ఉపాసన హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు సమాచారం ఇచ్చేందుకు టీఎస్ ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఆ సందర్భంగా తెలంగాణ డెస్క్ కు ఉపాసన కో-ఆర్డినేటర్ గా వ్యవహరించారు. “ఇన్వెస్ట్ తెలంగాణ” డెస్క్ లో కాసేపు కూర్చున్నారు. అంతేకాదు మైక్కోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కూడా ఉపాసన కలిశారు. ప్రపంచంలోని అత్యాధునిక హెల్త్ కేర్ వ్యవస్థలను ప్రారంభించేందుకు మైక్రోసాఫ్ట్ తో కలసి పని చేయబోతున్నట్టు ప్రకటించారు ఉపాసన.

 

Related posts