telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఉప్పెన ట్రైలర్ వచ్చేస్తుంది..

Uppena

మెగా కాంపౌండ్ నుంచి తెలుగు వెండి తెరకు పరిచయం కానున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్. అతడి మొదటి సినిమా చిత్రీకరణ ముగించుకుని చాలా కాలం అయినా విడుదల కాలేదు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ ప్రేక్షకులను అనుకున్నంతగా ఆకట్టుంటాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి అప్‌డేట్ ఉందంటే చాలా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ మంచి స్పందన పొందాయి. మెగా అభిమానులు ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సర్వం సిద్దమయింది. ఈ రోజు సాయంత్రం 4గంటల 5నిమిషాలకి యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ చేతులు మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఖరారయినప్పటికీ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో సినిమా వారిని అలరిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

Related posts