telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సూపర్ స్టార్ చేతుల మీదుగా ‘ఉప్పెన’ సాంగ్ లాంచ్….

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ సినిమానుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలైయ్యాయి. నీకన్ను నీలి సముద్రం అనే పాట ఎక్కడ చూసిన మారుమ్రోగుతుంది. ఈ పాట ప్రేమికులను, కుర్రాళ్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమానుంచి మూడవ పాట రానుంది. దీపావళి కానుకగా నవంబర్ 11న సాయంత్రం గం.4. 05 నిమిషాలకు ‘రంగులద్దుకున్న’ పాటను మహేష్ విడుదల చేయనున్నారు.ఈమేరకు చిత్రయూనిట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తిఅయింది కానీ కరోనా కారణంగా విడుదల ఆగిపోయింది. దాంతో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వైష్ణవ్. ఈ సినిమాలో వైష్ణవ్ కి జోడీగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. పస్ట్ ఫ్రేమ్ క్రీయోషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది,

Related posts