telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఉప్పెన వచ్చేది అప్పుడే.. ఓటీటీలో..?

ఉప్పెనా సినిమాలో హీరో, హీరోయిన్‌ల తొలి పరిచయం అయినప్పటికీ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచానాలు నెలకొన్నాయి. ఈ సినిమా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హీరోయిన్ కృతి సెట్టికి కూడా ఇదే తొలి సినిమా. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీలో అతి త్వరలో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేయనుందంట. చిత్రబృందం ట్రైలర్ విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకుందంట. ఆ ఒప్పందం ప్రకారం  థియేటర్లలో విడుదలైన 60రోజుల తరువాత సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు. ఈ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా ఏప్రిల్ 11న ఓటీటీలో రిలీజ్ అయ్యేందకు అవకాశాలు ఉన్నాయని సినీ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. చుడాలిమరి ఏం జరుగుతుంది అనేది.

Related posts